ఇస్మార్ట్‌ శంకర్‌కు రామ్‌చరణ్‌ ఫిదా

597
ram charan ismart shankar
- Advertisement -

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జీటాక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకురాగా చాలాకాలం తర్వాత ఈ మూవీతో హిట్ కొట్టాడు పూరి. పూరి సక్సెస్ దాహాన్ని తీరుస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు రూ. 61 కోట్లు రాబట్టగా ఈ మూవీకి సీక్వెల్‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు పూరి.

తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ చిత్రయూనిట్‌పై ప్రశంసలు గుప్పించారు. రామ్‌తో పాటు మిగితా నటీనటులంతా ఎనర్జిటిక్‌గా నటించారనిఫేస్‌ బుక్‌లో పేర్కొన్నారు చెర్రీ. ఈ మూవీ విజయానికి కారకులైన పూరికి అభినందనలు అని పోస్ట్ చేశారు.

రామ్‌ చరణ్‌ పోస్టుకు స్పందించారు హీరో రామ్‌. చెర్రీ చేసిన పోస్టును షేర్ చేస్తూ థాంక్యూ సో మచ్ మై బ్రదర్ అని పేర్కొన్నారు. ఇక హీరో సుమంత్‌ సైతం పూరీకి విషెస్ చెప్పారు. ఇస్మార్ట్‌ శంకర్‌ విజయం అందుకున్నందుకు రామ్‌, పూరి, ఛార్మిలకు శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్‌ చేశారు.

- Advertisement -