మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను హోరెత్తించాడు. యావరేజ్ సినిమాలకు కూడా 40 కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేర్చాడు. తన తోటీ ఫ్యామిలీ హీరోలంతా తమ మార్కెట్‌ని అంతకంతకు పెంచుకంటుంటే చెర్రీ తన మార్కెట్‌ను దిగజార్చుకున్నాడు. బన్నీ, సాయి ఈ సంవత్సరం సక్సెస్‌ని రుచి చూసినవారే.. వారి వారి మార్కెట్‌ని విస్తరించుకున్నవారే. ఎంతో హైప్ క్రియేట్ చేసుకొని, మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక పాత్రలో నటింపజేసినా బ్రూస్లీ సినిమా ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఇప్పుడు చెర్రీకి కావాల్సింది హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. తాజాగా రామ్ చరణ్ ధృవ టీజర్‌ని విడుదల చేశారు. విడుదల చేసిన 24 గంటల్లోనే పది లక్షల వ్యూస్ వచ్చాయి ఈ టీజర్‌కి. ‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే.. నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే.. నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువును సెలెక్ట్ చేసుకున్నాను’ అంటున్నాడు హీరో రామ్‌చరణ్.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న ‘ధృవ’ చిత్రం టీజర్‌ను దసరా సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా.. ప్రతినాయకుని పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. డిసెంబరులో ‘ధృవ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.