మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ-నందమూరి కుటుంబాల నుంచి మల్టీస్టారర్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇప్పటికే ఈ సినిమా కోసం జక్కన్న స్క్రీప్ట్ సిద్ధం చేసిన జక్కన్న ఒకేసారి ఇద్దరికి కథ వినిపించడంతో పాటు ఆపై వర్క్ షాపును కూడా నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ రిహార్సల్స్‌లో తారక్, చెర్రీ పాల్గొంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-రామ్ చెరో బ్యాగ్ పట్టుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించడంతో జక్కన్న మూవీ కోసమేనంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి.
గతంలో ‘బాహుబలి’ సినిమాకి కూడా ఈ విధంగా ప్రభాస్, రానాకు రిహార్సల్స్ నిర్వహించడం.. అది భారీ విజయం సాధించడంతో.. ఈ చిత్రం విషయంలోనూ దాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నారు రాజమౌళి. ఆగస్టులో సినిమా ప్రారంభంకానుండగా 2019 వేసవిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్..బోయపాటి శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ సైతం మరి కొద్ది రోజులలో త్రివిక్రమ్ సినిమా టీంతో జాయిన్ కానున్నాడు.
https://twitter.com/moviesupdate_/status/971270218600407040