మనం దర్శకుడితో రామ్ చరణ్

408
Ram Charan vikram kumar
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్, చరణ్ లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ 50శాతం పూర్తి చేసుకుంది. 2021జనవరిలో ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈమూవీ తర్వాత రామ్ చరణ్ ఎ దర్శకుడితో సినిమా చేస్తాడన్నది ఆసక్తి నెలకొంది.

తాజాగా ఉన్న సమాచారం మేరకు దర్శకుడు విక్రమ్ కుమార్ తో రామ్ చరణ్ తర్వాతి మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇటివలే విక్రమ్ కుమార్ చరణ్ లైన్ వినిపించాడని దీంతో వెంటనే కథను సద్దం చేయమన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. విక్రమ్ కుమార్ చివరగా నానితో గ్యాంగ్ లీడర్ సినిమాను తెరకెక్కించాడు. ఈమూవీ మంచి విజయం సాధించింది.

- Advertisement -