రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్.. ఫోటో వైరల్‌..

118
Ram Charan
- Advertisement -

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ తమిళ టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌తో భారీ బడ్జెట్‌ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు చరణ్‌. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇక లీకు రాయుళ్లు ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ తాజాగా లీక్‌ చేశారు. అయితే ఈ ఫోటో శంకర్ సినిమాలోనిదేనని టాక్‌ వినిపిస్తోంది.

ఈ ఫోటోలో గోదావరి ఒడ్డున తెల్ల చొక్కా, ధోతీ కట్టుకుని చేతులు మడతెట్టి సైకిల్ తొక్కుతున్న చరణ్ కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం ఆన్ లైన్ వైరల్‌గా మారింది. 1980ల నాటి రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. దానికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ కథకు సంబంధించిన ఫొటోనే ఇదని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు షేడ్స్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇక, తండ్రి బాటలోనే ఐఏఎస్‌గా ఉన్న తనయుడు కూడా రాజకీయ నాయకుడిగా మారతాడట. కథ మాట అటుంచితే ఈ ఫొటోను రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

- Advertisement -