‘విన‌య విధేయ రామ‌’.. న్యూ లుక్‌లో చరణ్‌..

258
- Advertisement -

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘విన‌య విధేయ రామ‌’. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.

Ram Charan

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెబుతూ.. శుక్రవారం ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చరణ్‌ పంచెకట్టులో హారతి తీసుకుంటూ కనిపించారు. ‘కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. సంక్రాంతికి కలుద్దాం’ అని ఈ ఫొటోకు చిత్ర బృందం క్యాప్షన్‌ ఇచ్చింది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి విడుద‌ల చేయనున్నారు.

- Advertisement -