పవన్‌ని పరామర్శించిన రామ్‌ చరణ్

565
pawan ramcharan
- Advertisement -

వడదెబ్బతో అస్వస్థతకు గురైన జనసేనాని,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని పరామర్శించారు రామ్ చరణ్‌. విజయవాడలోని పవన్‌ ఇంటికి వెళ్లిన చరణ్…ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పవన్‌ చాలా వీక్‌గా ఉన్నారని చెప్పారు. డాక్టర్లు ఈ ఎండలో తిరగడం మంచిది కాదని, క్యాపైనింగ్ చేసేప్పుడు వైద్యుల బృందాన్ని వెంట తీసుకెళ్లమని సలహా ఇచ్చారని, కానీ బాబాయ్ వారి సూచనను సున్నితంగా తిరస్కరించారని తెలిపారు.

పవన్ త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నా అని పవన్‌ను డాకర్ట్ పరీక్షిస్తోన్న ఫొటోను రామ్ చరణ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అయితే చరణ్ జనసేన తరపున ప్రచారం చేసే విషయమై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదు.

విజయనగరంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్‌ వడదెబ్బకు గురైన సంగతి తెలిసిందే. గన్నవరం విమానాశ్రయంలో కళ్లు తిరిగి పడిపోవడంతో.. వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. డాక్టర్లు పవన్‌కు విశ్రాంతి అవసరమని సూచించారు. కానీ ఆదివారం రాత్రి తెనాలిలో ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు.

- Advertisement -