మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాను మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
ఈ సినిమా తర్వాత చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం మహేష్‌తో భరత్ అను నేను సినిమా తెరకెక్కిస్తున్న కొరటాల తర్వాత చెర్రీతో మూవీకి ఓకే చెప్పినట్లు టీ టౌన్లో పుకార్లు షికార్ చేశాయి. కానీ తాజా సమాచారం ప్రకారం చరణ్ తర్వాత చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతుందట.
ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లోనే బోయపాటి బిజీగా ఉన్నాడనీ, వచ్చేనెలలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని అంటున్నారు. జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీలో చెర్రీ నటించనున్నాడనే వార్తలు వస్తున్నాయి. దాంతో కొరటాల శివతో చరణ్ చేయాలనుకున్న ప్రాజెక్టు ఆగిపోయిందా? లేదంటే వాయిదా పడిందా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.