అల్లు అర్జున్ హీరోగా వక్కంతపు వంశీ దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ ను పొందింగా మే 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలె మిలటరి మాధవరంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించగా మెగా బ్రదర్ నాగబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తాజాగా నా పేరు సూర్య ప్రిరిలీజ్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్రయూనిట్. ఈ నెల 29న హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రిరిలీజ్ ఈవెంట్ జరగనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో బన్నీ సైనికుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.