రామ్‌చరణ్‌ ‘రంగస్థలం 1985’

160
Ram Charan film titled ‘Rangasthalam 1985’
Ram Charan film titled ‘Rangasthalam 1985’
- Advertisement -

‘ధృవ’తో మంచి విజయాన్ని అందుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. సుకుమార్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల తనకు సాయం కావాలంటూ అభిమానులను కోరుతూ ఓ వీడియో పోస్టు చేశాడు చెర్రీ. ఈ సినిమాకు నాలుగైదు మంచి టైటిల్స్‌ను సుకుమార్‌ చెప్పినట్లు తెలిపారు. అయితే, వీటిలో ఏ టైటిల్‌ను ఫైనలైజ్‌ చేశారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం లేదన్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘రంగస్థలం 1985’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు పేరును జత చేసి తయారు చేసిన పోస్టరును పోస్ట్ చేశారు.

మొన్నటి వరకూ మండుటెండల్లో గోదావరి జిల్లాలో షూటింగ్‌లో పాల్గొన్న చెర్రీ… ఎండల నేపథ్యంలో బ్రేక్ తీసుకున్నాడు. ఎండలు తగ్గడంలో ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే మళ్లీ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌ కాగా జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ చిత్రాన్ని కూడా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా, అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా  అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. పాపికొండలు, రాజమండ్రి, కొల్లేరు పరిసర పల్లెటూళ్లలో సుమారు నెలరోజుల పాటు షూటింగ్‌ జరిపారు. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -