గేమ్ ఛేంజర్ టీజర్ కోసం సూసైడ్ లేఖ!

19
- Advertisement -

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా రామ్ చరణ్ అభిమాని సోషల్ మీడియా వేదికగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ను రిలీజ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటాను అంటూ ‘గేమ్ ఛేంజర్’ టీంకు సూసైడ్ లెటర్ రాశారు.

సినిమా రిలీజ్ కు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అభిమానుల ఎమోషన్స్ ను మేకర్స్ పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరి కల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను. చరణ్ అన్న భక్తుడు అంటూ లేఖ రాయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -