ధృవ ఆడియో వేడుక లేనట్టే..

219
online news portal
- Advertisement -

తెలుగు ఇండస్ట్ర్రీలో ఆడియో ఫంక్షన్స్ ఓ వేడుకలా జరుగుతాయి. అభిమానుల కోలాహాలం మధ్య హీరోలు ఆడియోను రిలీజ్ చేస్తారు. ధృవ సినిమాకు గాను మెగాపవర్ స్టార్ ఈ హడావిడికి దూరంగా వెళ్లాడు. ధృవ పాటలను గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్ ద్వారా కాకుండా,,,ఈనెల 9న డైరెక్ట్‌గా మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నారట. ఆడియో వేడుక కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న మెగా అభిమానులకు కాస్త నిరాశ కలిగించే వార్తే. ధృవ ఆడియో ఫంక్షన్ ద్వారా మెగా హీరోలందరిని ఒకే వేదికపై చూడాలనుకున్నఫ్యాన్స్‌కు కాస్త ఛేదు లాంటి వార్తే. కొంత కాలంగా మెగాహీరోల మధ్య పొరపచ్చాలు వచ్చాయని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసింది. అయితే ధృవ ఆడియో వేడుకతో ఈ వివాదాలకు చెక్ పెడతారా అని అనుకున్నారు అందరు. కానీ చెర్రీ ఆడియో ఫంక్షన్ నిర్వహించక పోవడంతో,,,వారి కోరిక నెరవేరలేదు.

online news portal

ఆడియోను గ్రాండ్ గా లాంచ్ చేయకపోవడానికి కారణం ధృవ పోస్ట్ ప్రొడక్షన్ పనులతోపాటు చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా ప్రొడక్షన్ పనుల్లో చెర్రీ బిజీగా ఉండడంతో ఈ వేడుక నిర్వహించడం లేదట. కానీ సినిమా రిలీజ్కు ముందు  ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను డిసెంబర్‌ 2 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాటలను ఈనెల 9న డైరెక్ట్ గా రిలీజ్ చేయనున్నారు. తమిళ్ మూవీ తని ఓరువన్ కు రీమేక్‌ గా ముస్తాబవుతున్న ఈసినిమాలో చరణ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కన్పించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఫ‌స్ట్ లుక్ నుంచే సినిమాపై ఆడియెన్స్‌లో క్రేజ్ నెల‌కొంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మితమవుతున్న ఈ సస్పెన్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రోడక్షన్ కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను విజయవాడ వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెర్రీకి ఈ సినిమా ఎంతో కీలకంగా  మారనుంది. ఫ్లాప్‌ నుంచి గట్టెక్కాలంటే చరణ్  హిట్  కొట్టాల్సిందే.

 

- Advertisement -