అవినీతి లేనిది సినీ పరిశ్రమ ఒక్కటే-చరణ్‌

221
- Advertisement -

ఇప్పుడు దేశంలో అవినీతి ఎంతగా పెరిగిపోయిందో..సామాన్య ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఒక సామాన్యమైన వ్యక్తి బయటికి వెళ్తే ప్రతి విషయంలోనూ..మోసం, దోపిడి,అవినీతి తో సతమతమవుతూనే ఉన్నాడు. ఈ రోజుల్లో సొసైటీలో కరెప్షన్ లేని వ్యవస్థ ఎక్కడైనా ఉంటుందా..కానీ ఈ ప్రపంచంలో ఏదైనా కరప్షన్ లేని పరిశ్రమ ఉందంటే, అది ఒక్క సినీ పరిశ్రమ మాత్రమేనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యాఖ్యానించాడు.

స్టయిలిష్ట స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ‘‘అవినీతి లేని పరిశ్రమ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది సినిమా పరిశ్రమ ఒక్కటే’’‌. ‘‘సినిమా వాళ్లమంతా ఉదయం ఐదింటికి లేస్తాం. జిమ్ చేసి తరవాత మేకప్ వేసుకుని షూటింగ్ స్పాట్ కు వెళతాం. రాత్రి వరకు అక్కడే పనిచేస్తాం. ప్రేక్షకులను మెప్పించేందుకు ఎన్నో రిస్కీ షాట్స్ చేస్తాం. దానిమూలంగా ఎన్నోసార్లు గాయపడుతుంటాం.

Ram Charan Defends Telugu Film Industry

బన్నీ ఎన్నిసార్లు గాయపడ్డాడో నాకు తెలుసు. ప్రభాస్ కు రెండుసార్లు భుజానికి సర్జరీ అయింది. బాలకృష్ణ.. మా డాడీ చిరు కూడా గాయపడ్డారు. ఒళ్లు హూనం చేసుకుని రేపు ఏం చేయాలి అని ఆలోచిస్తాం. ఈ ప్రాసెస్ లో కరెప్షన్ ఎక్కడుంది.’’అంటూ రామ్ చరణ్ సూటిగా క్వశ్వన్ చేశాడు.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక నటిస్తున్న ఈ చిత్రనికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మాత. నాగబాబు సమర్పిస్తున్నారు. విశాల్‌ – శేఖర్‌ స్వరాలు సమకూర్చారు. మే 4న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

- Advertisement -