‘రాజవంశస్తుడు‘గా చిట్టిబాబు…

233
- Advertisement -

రంగస్థలంతో రాంచరణ్ మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ చేరువలో ఉంది. రంగస్థలంలో తన నటనతో విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకున్నాడు రాంచరణ్. అయితే తన తర్వాత చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసినదే. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్‎ని కూడా మొదలుపెట్టింది. ఈ షెడ్యూల్‎లో రాంచరణ్ జాయిన్ కానున్నాడని తెలుస్తుంది.

Ram Charan, Boyapati Srinu Movie

ఈ సినిమాకి కథకి తగ్గటుగా ‘రాజవంశస్థుడు‘ అనే టైటిల్ బాగుంటుందని బోయపాటి భావిస్తున్నారట. కానీ ఈ టైటిల్‎కి సంబంధించి చరణ్, చిరంజీవి, అల్లు అరవింద్ ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే బయటికి వచ్చిన టైటిల్ బావుందని మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చరణ్, చిరంజీవి, అల్లు అరవింద్ ఇదే టైటిల్‎ని ఓకే చేస్తారా..? లేక వేరే టైటిల్‎ని సూచిస్తారా అనేది మాత్రం వేచిచూడాల్సిందే.ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.

- Advertisement -