విజేతపై చిట్టిబాబు స్పందన..

270
Ram Charan About Kalyan dev Vijetha Movie
- Advertisement -

రాకేశ్ శశి దర్శకత్వంలో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా విజేత ట్రైలర్ పై హీరో రామ్ చరణ్ స్పందించాడు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందంటూ మెచ్చుకున్నాడు. విజేత చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేశాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా యూట్యూబ్ లో ట్రేడింగ్ లో కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

vijetha

మొదటి సినిమాతోనే హిట్ కొట్టాలని భావిస్తున్నాడు కల్యాణ్ దేవ్. అందుకు తగ్గట్టుగానే డాన్స్, ఫైట్స్ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. విడుదలైన ట్రైలర్ లో కల్యాణ్ డాన్స్ కు ప్రేక్షకుల నుంచి  మంచి స్పందన వస్తోంది. లుక్స్ పరంగా కూడా మంచి మార్కులే కొట్టేశాడు. కల్యాణ్ కెరీర్ పై మామ చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. చిరంజీవితో పాటు మెగా హీరోలు సైతం ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, కల్యాణ్ రెండవ సినిమాకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రెండవ సినిమాకు దర్శకుడిగా హరీశ్‌ శంకర్ వ్యవహిరించనున్నట్లు టాక్. ఇది ఎంతవరకు వాస్తమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

- Advertisement -