ఖర్చు తగ్గించాలంటున్న చెర్రీ..

199
Ram-Charan-Boyapati-film
- Advertisement -

రంగస్థలం తరువాత చరణ్, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. బోయపాటి సినిమాలు అనగానే భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటాడు. ఆయన సినిమాలలో హీరో పాత్రలకే కాదు, విలన్ పాత్రకు కూడా అదే మాదిరిగా ఖర్చు చేస్తుంటాడు. తాజాగా ఈ సినిమాలో కూడా విలన్ ఇంట్రడక్షన్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశాడట. దీంతో బడ్జెట్ పెరిగిపోతుండడంతో ఖర్చు తగ్గించేలా చూడాలని బోయపాటితో చెర్రీ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Boyapati-Ram-Charans

అనుకున్న బడ్జెట్ కంటే 10 కోట్లు తక్కువ ఖర్చు చేసేలా చూడాలని సూచించినట్లు ఫిలింనగర్లో టాక్. మార్కెట్ ఉంది కదా అని నిర్మాతలతో ఖర్చు చేయించవద్దని.. వారికి లాభాలు వచ్చేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు బడ్జెట్ విషయంలో చరణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడట. రంగస్థలం వంటి భారీ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో.. చెర్రీ అన్ని విధాలుగా ఈ సినిమాపై శ్రద్ద తీసుకున్నాడని ఫిలిం నగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

- Advertisement -