ఆ భాద తీరబోతుంది- రకుల్‌

191
- Advertisement -

తెలుగులో అగ్రకథానాయికగా దూసుకుపోతోన్న రకుల్, ఆల్రెడీ తమిళంలోను కొన్ని సినిమాలు చేసింది. అయితే అవేవి అంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఆమెకి అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన తరువాత అక్కడి నుంచి కూడా ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. కార్తీతో ఒక సినిమా చేసిన ఆమె .. త్వరలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్యతో ఓ సినిమా చేయనుంది.

Rakul Preet's Second Innings In Kollywood

ఈ మధ్యలో తెలుగుతో పాటు తమిళంలోను ‘స్పైడర్’ సినిమా రిలీజ్ కానుంది. ముగ్గురూ స్టార్ హీరోలే .. మూడు వైవిధ్యభరితమైన చిత్రాలే. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ, ఇంతవరకూ తమిళంలో హిట్ కొట్టలేకపోయినందుకు బాధగానే ఉందని అంది. అయితే త్వరలో తమిళ ప్రేక్షకులముందుకు రానున్న తన సినిమాలతో ఆ బాధ తీరిపోనుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. కోలీవుడ్ లోను రకుల్ తన హవాను మొదలెడుతుందేమో చూడాలి.

- Advertisement -