అఖిల్ ను తమ్ముడంటున్న రకుల్..!

213
actress Rakul Preet Singh
- Advertisement -

దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా గడుపుతోంది.  ఇప్పటి డార్లింగ్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్ అన్న రేంజ్ లో సినిమాలు చేసేస్తోంది. ఈ హీరో, ఆ హీరో అని లేదు. దాదాపు అందరు హీరోలను చుట్టేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తన  బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉండాలో చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

టాలీవుడ్ లో ఇప్పుడు యమబిజీగా ఉన్న ఈ హీరోయిన్ ప్రస్తుతానికి తను సింగిలే అని స్పష్టం చేస్తోంది. అయితే ఎలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలో మాత్రం రకుల్‌కు ఫుల్ క్లారిటీ ఉంది. ఒక వ్యక్తి పేరు ప్రస్తావించి.. అచ్చం అలాంటి లక్షణాలున్న బాయ్‌ఫ్రెండ్ కావాలి, అని రకుల్ చెప్పింది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ప్రకాశ్ కోవెలమూడి. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్. ఈయన కూడా దర్శకుడిగా సినిమాలు చేశాడు. ఈ మధ్యనే ‘సైజ్‌జీరో’ సినిమాకు దర్శకత్వం వహించాడు.రకుల్‌తో సినిమాలేవీ చేయలేదు కానీ.. రకుల్‌కు మాత్రం ఈయన బాగా నచ్చేశాడు.

ఎంతలా అంటే… అచ్చం ఇలాంటి వ్యక్తే బాయ్‌ఫ్రెండ్ కావాలనేంత. తనకు గనుక బాయ్‌ఫ్రెండ్ దొరికితే.. అతడిని ట్రైనింగ్ కోసం ప్రకాశ్ దగ్గరకు పంపిస్తానని రకుల్ చెప్పుకురావడం విశేషం. ప్రకాష్ కోవెలమూడి వివాహితుడు. అందుకే అతడిని వదిలేసి.. అతడి లాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని రకుల్ అంటోంది. అలాగే చిత్రసీమలోని తన సన్నిహిత వ్యక్తుల గురించి కూడా రకుల్ చెప్పుకొచ్చింది.

అఖిల్ తనకు తమ్ముడిలాంటి వాడని చెప్పింది,  రవితేజను మాత్రం రవిగారు అంటానని, నాని చాలా డెడికేటెట్ అండ్ సిన్సియర్ అని, రానా మాంచి హోస్ట్ అని, రాశీ ఖన్నా సైలెంట్ అని, లక్ష్మి తనకు అమ్మలాంటిదని, చాలా కేర్ తీసుకుంటుందని రకుల్ వివరించుకు వచ్చేసింది. అందరి గురించి చెప్పింది కానీ, ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఫ్రెండ్ గా వున్నా సందీప్ కిషన్ గురించి మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పలేదు.

- Advertisement -