టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు గట్టి షాకే తగిలింది. ఇప్పటివరకూ వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న రకుల్.. మహేష్ బాబుతో చేసిన స్పైడర్ మూవీతో స్టార్ హీరోయిన్ అవాలని కలలు కనేసింది. కానీ ఆ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో.. అమ్మడి ఆశలు నెరవరలేదు. పైగా ఖాతాలో ఓ భారీ డిజాస్టర్ కూడా పడింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు మరో కోరిక కూడా తీరని కోరిక గానే ఉండిపోయింది. అదేంటంటే తెలుగులో సక్సెస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ తమిళ్ లో కూడా తన సత్తా చాటుకోవాలని తహతహలాడుతోంది.
స్పైడర్ మూవీతో దర్శకుడు మురుగదాస్ తన కోరిక తీర్చేశాడని నమ్మకం పెట్టుకోగా.. ఆ ఆశలు కూడా ఆవిరి అయిపోయాయి. కానీ మురుగదాస్ తెరకెక్కించనున్న మరుసటి చిత్రంలో ఈమెకు అవకాశం ఇచ్చాడనే టాక్ ఇన్నాళ్లు ఉంది. విజయ్ హీరోగా రూపొందే 62వ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక అనే ప్రచారం ఇప్పటివరకూ జరగగా.. ఇప్పుడీమెకు హ్యాండ్ ఇచ్చేసి.. నయనతారను తీసుకున్నారనే టాక్ మొదలైంది. తాజాగా ఆరామ్ మూవీతో గ్రాండ్ విక్టరీ కొట్టేసిన నయన్ ను విజయ్ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నయనతారతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుందా.. లేక రకుల్ కి అనుకున్న రోల్ నే నయన్ కు ఆఫర్ చేస్తున్నారా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
ఒకవేళ విజయ్ సరసన నయనతార నటిస్తే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. ఇంతకు ముందు శివకాశి చిత్రంలో విజయ్‌తో కలిసి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చిన నయనతార 2009లో వచ్చిన విల్లు చిత్రంలో కథానాయకిగా నటించింది. మళ్లీ ఎనిమిదేళ్ల తరువాత విజయ్‌తో కలిసి నటించనుందన్న మాట.