రెండుసార్లు మిస్ ఇండియా ఫైనల్స్‌కి వెళ్ళడమే కాకుండా నాలుగు సబ్ టైటిల్స్ గెల్చుకొని మోడలింగ్ ఫీల్డ్‌కి వెళ్ళి ఆ తర్వాత కన్నడలో ‘గిల్లి’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది అందాల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరోగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కిరణ్ నిర్మించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రకుల్ తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. తర్వాత టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ చిన్నది…ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో పాల్గొన్న రకుల్ స్వల్పంగా గాయపడింది. రూ.90 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు మురుగదాస్ కొద్ది రోజులుగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రకుల్ వేలు ఫ్యాక్చర్ అయినట్టుగా వార్తలు రావటంతో ఆమె సన్నిహితులు అభిమానుల ఆందోళన చెందారు.
ఈ విషయం పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్, తన ట్విట్టర్ పేజ్ లో ‘నా వేలు ఫ్యాక్చర్ కాలేదు. కేవలం బెణికింది. త్వరలోనే సెట్ అవుతుంది. ఈ విషయం స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేసింది.కాగా, ఈ చిత్రం వచ్చే యేడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహేష్‌తో మూవీనే కాక సాయిధరమ్ తేజ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విన్నర్, రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ ధృవలోను రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక పాత్ర పోషిస్తోంది.