వెబ్ లోకి రకుల్ కూడా !

83
- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ ఇక నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా డిజిటల్ రంగంలోకి వచ్చింది. అలాగే యాక్షన్ బాట పట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ ఓ హిందీ వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా కనిపించడంతో పాటు తనలోని నటిని కూడా సంతృప్తి పరుచుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్న మొదటి వెబ్ సిరీస్ షూటింగ్ రీసెంట్ గానే మొదలు అయ్యింది. సర్దార్ కా గ్రాండ్ సన్ సినిమా దర్శకుడు కాశ్వీ నాయర్‌ దర్శకత్వంలో మెదలైన ఈ వెబ్ సిరీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా యాక్షన్ రోల్ చేస్తుండటం విశేషం.

అంతే కాదు, రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో పోలీస్ పాత్ర పోషిస్తోంది. ఖాకీ పాత్రతో పాటు ‘వ్యభిచారం’ చేసే ముఠాకి నాయకురాలి అవతారంలో కూడా రకుల్ దర్శనమివ్వనుంది. ఇలా ఎన్నో కొత్త అవతారాలు ఈ ఒక్క వెబ్ సిరీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ చూపిస్తోందట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్న ఈ సిరీస్ లో బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయట. ఇప్పటికే హిందీ బాట పట్టిన రకుల్.. ఈ మధ్య విచ్చలవిడిగా మరీ బోల్డ్ గా నటిస్తూ ముందుకు పోతుంది.

ఏది ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ హీరోయిన్ గా ఇంకా అవకాశాలు పొందుతూనే ఉంది. దీనికితోడు రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. రకుల్ పని అయ్యిపోయింది అనుకున్న ప్రతిసారి కొత్తగా ఆమె మన ముందుకొస్తోంది. అన్నట్టు సౌత్ లో రకుల్ ప్రీత్ ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -