రకుల్‌ ను వేధించిన దర్శకుడు..!

221
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. వరుస సినిమాలు చేస్తు అతి తక్కువ కాలంలోనే ఎక్కువ స్టార్ డమ్ ని అందుకున్న హీరోయిన్స్ రకుల్‌. ఇండస్ట్రీలో దాదాపు అన్ని పరిస్థితులను రకుల్ ఎదుర్కొందనే చెప్పాలి. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకొని ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకొని స్టార్ హీరోలతో సినిమాలను చేసి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత మళ్లీ అపజయాలను అందుకొని వెంటనే మళ్లీ హిట్స్ అందుకుంది.

Rakul Gave a Strong Warning to a Director

అయితే ఇప్పుడు మళ్లీ రకుల్‌ పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉన్నా అనుభవం ఉండడంతో వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకునేలా ప్లాన్స్ వేసుకుంటుందట. అయితే రకుల్ ఇప్పటివరకు చేసిన దర్శకులతో ఎటువంటి ఇబ్బంది రాలేదని చెప్పింది. కానీ ఒక్క దర్శకుడు మాత్రం ఆమెను చాలా కోపానికి గురి చేశాడని.. మానసికంగా వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఆమెతో వర్క్ చేసిన ఒక దర్శకుడు ఈమధ్యనే రకుల్ దగ్గరికికి వచ్చి ఒక లేడి ఓరియెంటెడ్ కథ చెప్పాడట. కానీ రకుల్ కు కథ నచ్చలేక ఒప్పుకోలేదు. దీంతో ఆ దర్శకుడు ఎలాగైనా సినిమా ఒకే చేయించాలని చాలా ప్రయత్నించాడు. వేధించాడు కూడా అయితే గట్టిగా ఒకసారి వార్నింగ్ ఇస్తే కాని మనోడు తన ప్రయత్నాలు మానుకోలేదట.

- Advertisement -