చిన్న సినిమాలతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తర్వాత ఊహించని అవకాశాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన సినీ ప్రయాణాన్ని సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. టాప్ హీరోలంతా రకుల్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ ఏడాది ‘రారండోయ్ వేడుక చూద్దాం’ .. ‘జయ జానకి నాయక’ వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్న రకుల్, స్పైడర్‌తో కాస్త నిరాశపర్చిన అదేమీ తన కెరీర్‌పై ఎఫెక్ట్ చూపించలేదు. 2017లో సక్సెస్ ఫుల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న రకుల్ 2018లో కూడా అదేజోరు కొనసాగిస్తానని చెబుతోంది.
ప్రస్తుతం రకుల్ హిందీలో ‘అయ్యారీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రకుల్‌కి జోడీగా సిద్దార్థ్ మల్హోత్రా నటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న రకుల్ బాలీవుడ్‌లో ఎంట్రీతోనే అదరగొట్టాలని చూస్తోంది.
సినిమా ప్రపంచంలోకి రావాలన్నది నా కల…. నాకు నచ్చిన రంగంలోనే ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. అంతేగాదు ఇకపై తాను నటించే తెలుగు సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటానని చెబుతోంది. కెమెరా ముందు ఎంత సేపు ఉండమన్నా ఉంటాను. కెమెరా ముందు నిలబడితే నాకు కలిగే ఆనందం ప్రపంచంలో మరెక్కడా నాకు దొరకదని చెబుతోంది.