రకుల్ నోట హీరోయిన్ల పారితోషికం మాట…

234
rakul- preeth singh
- Advertisement -

దక్షిణాదిన విజయశాంతి తర్వాత ఆ తరహాలో హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న నటి నయనతార. ఆమెను ఇప్పుడందరూ లేడీ సూపర్ స్టార్ అంటున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల‌న్నా, సీనియ‌ర్ హీరోల‌తో సినిమాల‌న్నా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మొద‌ట‌గా గుర్తొచ్చే పేరు న‌య‌న‌తార‌దే. ఆమె న‌టించిన సినిమాలు స్టార్ హీరోల‌తో స‌మానంగా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతుంటాయి. అయిన‌ప్ప‌టికీ స్టార్ హీరోల‌కు ఇచ్చే రెమ్యున‌రేష‌న్‌లో స‌గం కూడా న‌య‌న‌తార‌కు ద‌క్క‌డం లేదు. దీని గురించి మ‌రో స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది.

rakhul-preeth-

తాను తన కష్టానికి తగ్గ పారితోషికం అందుకుంటున్నానని,  హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దుక్కుతుంది చాలా తక్కువ మొత్తమే అని ఆమె అభిప్రాయపడుతోంది. హీరోయిన్లు ఎంత స్టార్ ఇమేజ్ సంపాదించినప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం ఎదుగుదల లేదని రకుల్ అభిప్రాయపడింది. సినిమా ప్రపంచమే పురుషాధిక్య ప్రపంచమని… ఇక్కడ హీరోయిన్స్ కి పెద్దగా గౌరవ వేతనాలు ఉండవనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది రకుల్ ప్రీత్.

Rakul-Preeth-Singh

నయనతార నటించిన సినిమాలన్నీ స్టార్ హీరోల సినిమాలతో సమానంగా కలెక్షన్స్ కొల్లగొడతాయని… స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న.. నయనతారకి కేవలం మూడు కోట్లు మాత్రమే నిర్మాతలు ముట్టజెబుతున్నారని… ఆమెతో సినిమాలు చేస్తే నిర్మాతలకు లాభాల పంట… అయినప్పటికీ ఆమెకి హీరోలకు ఇచ్చే పారితోషకంలో సగం కూడా ఇవ్వడం లేదని.. కేవలం హీరోలకిచ్చే దానిలో నాలుగో వంతు మాత్రమే ఇస్తున్నారని చెబుతుంది.మరి ఉన్నట్టుండి రకుల్ కి నయన్ ని పొగడాల్సిన పని ఏమిటో.. అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు.

- Advertisement -