రకుల్ ‘చమ్మా చమ్మా’ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌..

303
- Advertisement -

రకుల్‌ ప్రీత్ సింగ్‌ తన అందం అభినయంతో దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది‌. ఈ అమ్మడు నెటింట్లో చాలా చురుగ్గా ఉంటుంది. ఈ భామ తాజాగా సోషల్‌మీడియాలో డ్యాన్స్‌ సాధన చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. అందులో ఆమె కొరియోగ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌ నటించిన ‘చమ్మా చమ్మా’ సాంగ్‌కు రకుల్‌ డ్యాన్స్‌ చేసింది.

Rakul Preet Singh

‘మీ ప్రయాణంలో ఎక్కువ అవకాశాలు తీసుకోండి.. ఎక్కువగా డ్యాన్స్‌ చేయండి.. ధన్యవాదాలు గుల్నాజ్‌ ఖాన్, అంకన్‌ సేన్‌. ఓ రోజు నేనూ మీలాగా చక్కగా డ్యాన్స్‌ చేయగలుగుతానని ఆశిస్తున్నా.. అప్పటి వరకూ నేర్చుకుంటూనే ఉంటా’ అని ఆమె పోస్ట్‌ చేశారు. రకుల్‌ డ్యాన్స్‌ వీడియోకు మంచి స్పందన లభించింది. నెటిజన్లు రకుల్‌ డ్యాన్స్‌ అద్భుతంగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

- Advertisement -