రకుల్‌కి షాకిచ్చిన మురుగదాస్..!

139
Rakul again sign Murugadoss movie

సైలెంట్ గా వచ్చి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటిస్తూ బడా ఇమేజ్ అందుకుంది ఈ గ్లామర్ బ్యూటీ. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తన అభినయంతో ఆకట్టుకుని అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది ఈ బ్యూటీ.  సినిమా సినిమాకీ తన గ్లామర్‌ పెంచుతూ .. కొత్త కొత్తగా ముస్తాబవుతున్న రకుల్ మకుటం లేని మహారాణిగా రాణిస్తోంది. ఇటు టాలీవుడ్‌తో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్లతో ఈ అమ్మడు బిజీగా ఉంది. 2018 చివరి వరకు రకుల్  డైరీ ఖాళీనే లేదట.

Rakul again sign Murugadoss movie

ప్రస్తుతం మహేష్‌తో సినిమా చేస్తున్న రకుల్ … నాగచైతన్యతో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కార్తి హీరోగా ‘తీరం అధికారం ఒండ్రు’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు  సెట్స్ పై ఉండగానే మరో స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది రకుల్‌. కార్తి అన్నయ్య సూర్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎస్‌ 3 సినిమాతో అలరించిన సూర్య విఘ్నేష్ దర్శకత్వంలో స్పెషల్ చబ్బీస్ రీమెక్‌లో నటిస్తున్నాడు. దీని తర్వాత  విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి కమిటయ్యాడు సూర్య.

ప్రస్తుతం ఆమె మురుగదాస్ సినిమాలో మహేశ్ బాబు జోడీగా నటిస్తోంది. ఆమె నటన .. అంకితభావం చూసిన మురుగదాస్, తన తదుపరి సినిమాలోను ఛాన్స్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. మురుగదాస్ తదుపరి సినిమా విజయ్ తో వుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కత్తి’ .. ‘తుపాకి’ భారీ విజయాలను సాధించాయి. దాంతో మరో ఆసక్తికరమైన కథతో ఈ ఇద్దరూ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా కోసం రకుల్ ను మురుగదాస్ అడిగాడట. డేట్స్ లేకపోయినప్పటికీ, ఎలాగైనా సర్దుబాటు చేసి ఈ సినిమా చేయాలనే ఆశతో రకుల్ ఉందని చెప్పుకుంటున్నారు. విజయ్ సరసన ఛాన్స్ తగలడమంటే మాటలా మరి!