భారీ అంచనాలతో వస్తున్న ‘రాక్షసుడు’

452
rakshasudu
- Advertisement -

హిట్ ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. ఇండస్ట్రీలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హీరో తాజాగా రాక్షసుడిగా ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఆగస్టు 2న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

2 గంటల 29 నిమిషాల రన్ టైమ్ తో U/A సర్టిఫికేట్ సొంతం చేసుకుంది రాక్షసుడు. టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్య చేసే ఒక సైకో కిల్లర్ కథ ఇది. తమిళంలో రాచ్చసన్ విడుదలై భారీ వసూళ్లు రాబట్టగా తెలుగులో రాక్షసుడిగా ప్రేక్షకుల ముందుకువస్తోంది.

Image

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా అనుపమా పరమేశ్వరన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్,ట్రైలర్ అందరిలో ఆసక్తిని పెంచేశాయి. రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కగా కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఈ మూవీ తెరకెక్కింది.

- Advertisement -