రాక్షస కావ్యం.. సక్సెస్ మీట్

28
- Advertisement -

కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయని ప్రూవ్ చేసింది రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన “రాక్షస కావ్యం”. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు. “రాక్షస కావ్యం”కు ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ బాగుండటంతో రోజు రోజుకూ థియేటర్స్, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు మూవీ టీమ్. ఈ సందర్భంగా

నిర్మాత దామురెడ్డి మాట్లాడుతూ – మా “రాక్షస కావ్యం” సినిమాకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగుంది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్స్ కూడా మరో 30 థియేటర్స్ పెంచారు. 100 థియేటర్స్ లో రిలీజైన మా సినిమా 130 థియేటర్స్ లో అందుబాటులోకి వస్తుంది. కంటెంట్ బాగున్న సినిమాలను ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. “రాక్షస కావ్యం” సినిమాతో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు దక్కుతోంది. మా సినిమాకు మరింత ఆదరణ చూపిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

నటుడు దయానంద్ రెడ్డి మాట్లాడుతూ – “రాక్షస కావ్యం” సినిమాను థియేటర్స్ కు వెళ్లి ప్రేక్షకుల మధ్య చూశాం. వాళ్ల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ మాకెంతో హ్యాపీనెస్ ఇస్తోంది. డైరెక్షన్ దగ్గర నుంచి ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ దాకా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఈ సినిమా భిక్షపతి అనే క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మా సినిమాను మరింత పెద్ద సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నారు.

Also Read:ఆస్తమా ఉందా..అయితే జాగ్రత్త!

నటుడు పవన్ రమేష్ మాట్లాడుతూ – “రాక్షస కావ్యం” సినిమాకు ఆడియెన్స్ రెస్పాన్స్ బాగుండి థియేటర్స్ పెరుగుతున్నాయి. మేము థియేటర్స్ విజిట్ చేసినప్పుడు సెల్ఫీల కోసం ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుంటున్నారు. నేను చైతన్య అనే స్టూడెంట్ రోల్ చేశాను. నా క్యారెక్టర్ బాగుందని చెబుతుండటం సంతోషంగా ఉంది. అన్నారు.

నటి రోహిణి మాట్లాడుతూ – “రాక్షస కావ్యం” వంటి మంచి సినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. ఇది చిన్న సినిమా కాదు. డిఫరెంట్ మూవీ. కథ, స్క్రీన్ ప్లే అన్నీ కొత్తగా ఉంటాయి. మీరు ఒక్కసారి థియేటర్ కు వచ్చి చూస్తే మా సినిమా ఎంత ఫ్రెష్ కంటెంట్ తో వచ్చిందో మీకు తెలుస్తుంది. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థాంక్స్. అన్నారు.

- Advertisement -