జూన్ 7న క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’

14
- Advertisement -

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ర‌క్ష‌ణ చిత్రం మెప్పించ‌నుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ..‘రక్షణ’ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇదొక ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. ఈ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను జూన్ 7న విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

Also Read:నటనకు నిర్వచనం…ఎన్టీఆర్

- Advertisement -