తరతరాలుగా సంప్రదాయబద్దంగా జరుపుకునే పండుగలలో రాఖీ పండుగ ముఖ్యమైనదిగా చెప్పవచ్చును. అన్నాచెల్లెలు మరియు అక్కా-తమ్ముడి అనుబంధానికీ ప్రతీకగా నిలిచేదే ఈ రాఖీ పండుగ. ఒక కుటుంబంలో తల్లితండ్రులు తమ పిల్లలను ఆడ మగ అని తేడా లేకుండా విద్యాబుద్దులు, మంచి చెడులు, అనుబంధాల గురించి నేర్పించడం జరుగుతుంది. అయితే, యుక్త వయసు వచ్చిన తరువాత కాలనురీత్యా ప్రతి అమ్మాయికి, అబ్బాయికి జీవితంలో పెళ్లి అనేది ఒక భాగం.
అతి ప్రేమగా అన్నాతమ్ముల మధ్య పెరిగిన ఆడపిల్లలు పెళ్లి తదుపరి ఒక కుటుంబం నుండి మరో కుటుంబానికి పంపించడం జరుగుతుంది. అన్నా చెల్లెల అనుబంధానికి మరియు వారికి ఎల్లవేళలా రక్షణగా ఉండాలని గుర్తుగా ఆడపిల్లలు ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా పుట్టింటిని గుర్తు చేసుకోడానికి గుర్తుగా చేసుకునేదే ఈ రాఖీ పౌర్ణమి పండగ. ఈ శుభసందర్బముగా ప్రతి ఆడపిల్ల..స్త్రీ తమ అన్న,తమ్ముడుకి సంప్రదాయ పద్దతిలో రాఖీ కట్టడంతో పాటు ఒక మొక్కని నాటినట్లైతే ఆ బంధానికి సార్ధకత చేకూరుతుంది.
ప్రతి అక్క,చెల్లి తమ అన్న,తమ్ముడు ఇంటికి రాఖీ సందర్భంగా వెళ్ళేముందు ఇంటికి ఉపయోగపడే మామిడి, జామ, నిమ్మ, కరివేపాకు, దానిమ్మ, బొప్పాయి, మునగ లాంటి ఒక మొక్కను తమ ఇంట్లో నాటడంతో పాటు మరో మొక్కను పుట్టింటికి తీసుకుని వెళ్ళి రాఖీకి గుర్తుగా అన్న-తమ్ముడుతో కలిసి నాటి రాఖీ కట్టడంతో పాటు ఆ మొక్క సంరక్షణ బాధ్యతలను తీసుకునేటట్లు వారికి భాద్యతను అప్పచెప్పవలసినదిగా కోరడమైనది. దీని వలన పోషకవిలువలు గల తాజా పండ్లను మన ఇంట్లో మనమే పండించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మరియు ఆక్సిజన్ లభ్యతను పెంపొందించడానికి తోడ్పడుతుంది. దానితో ప్రతిరోజు మన కుటుంబసభ్యులను గుర్తుచేసుకొన్న వాల్లము అవుతాయి.
మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అమలుచేయబడుతున్న తెలంగాణకు హరితహారంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు అనగా మూడున్నర కోట్ల మంది రాఖీ పండుగ సందర్భంగా ఒక మొక్కను నాటినట్లైతే మూడున్నర కోట్ల మొక్కలను నాటినట్లవుతుంది. కావున, తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ.. పైన చెప్పినట్లు రాఖీ పండుగ సందర్భంగా కచ్చితంగా ఇంటికి ఉపయోగపడే మొక్కలను వారి ఇంట్లో నాటి మరియు అన్న-తముళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు రాఖీతో పాటు మొక్కలను కూడా తీసుకుని వెళ్ళి నాతే భాద్యతను అన్న-తమ్ముళ్ళకు అప్పచెప్పి వారిని కూడా హరితహారంలో భాగస్వాములు కావాలని ఉద్యానశాఖ కోరడమైనది.