కేటీఆర్‌ని అరెస్ట్‌ చేస్తే హీరో కాలేరు: రాకేష్ రెడ్డి

1
- Advertisement -

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కేవలం కక్ష్య సాధింపు కోసమే అన్నట్టుంది వారి ప్రవర్తన…ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, కేవలం కేటీఆర్ ని అరెస్టు చెయ్యడం మీదనే తన దృష్టి అంతా కేంద్రీకరించారు అన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగు రాకేశ్ రెడ్డి. తన వైఫల్యాల ను అడుగడుగునా ఎండగగడుతున్నందుకే ఈ అరెస్టు…రేవంత్ రెడ్డి ఈ చిలిపి చేష్టలు, డైవర్షన్ పాలిట్రిక్స్ పక్కన పెట్టి, పాలన మీద దృష్టి పెడితే మంచిదన్నారు. రేవంత్ రెడ్డి లక్ష కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడ్డుపడుతున్నాడని, ప్రజల సుమ్ముకు కావాలని కాస్తున్నారని ఈ లక్ష్య కేసు అన్నారు.

ఇప్పటి వరకూ జరిగిన రాజకీయం ట్రైలర్ మాత్రమే ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్టు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదు.కేటీఆర్ గారు ఈ ఫార్ములా రెస్ లో ప్రపంచ మేటి నగరాల సరసన హైదారాబాద్ ను నిలిపేందుకు అడుగులు వేస్తే ఆ ప్రయత్నాలను అడ్డుకోవడమే కాక అరెస్తా?, ఫార్ములా రేసును నిలిపివేసి ప్రపంచ మార్కెట్ లో తెలంగాణ పరువు గంగలో కలిపారు అన్నారు.

కేటీఆర్ హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం హైడ్రా పేరుతో మరో గాజా, పాలస్తీనా ను తలపించేలా చేస్తున్నారు. హీరోలను అరెస్టు చేస్తే అంతకంటే పెద్ద హీరో అవుతానని, కేటీఆర్ ను అరెస్టు చేస్తే తాను కేటీఆర్ కేటీఆర్ కంటే పెద్ద నాయకుడ్ని అవుతానని రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడు….ఈ ఫార్ములా రేసు తప్పే అయితే సంవత్సర కాలంగా ఇన్ని మల్లగుల్లాలు పడటం దేనికి అన్నారు.స్వయంగా కేటీఆర్ గారే అవును తాను ప్రభుత్వపరంగా అనుమతి ఇచ్చానని, ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడిమరి నిర్వాహకులను ఒప్పించి తీసుకొచ్చామని అది ప్రభుత్వ పాలసీ నిర్ణయమని చెప్తున్నారు. ఇందులో దాపరికం, దొంగతనం ఏముంది.? అన్నారు.

ఏ గూటి పక్షులకు ఆ గూటి వార్తలు అన్నట్టు ప్రతీదాంట్లో రాబడి చూసుకునే రేవంత్ రెడ్డికి ప్రతేదాంట్లో ఏదో జరిగే ఉంటుందన్న అనుమానం కలుగుతుంది,ఈ అరెస్టు పేరుతో మరో 6 నెలలు పాలనను జూబ్లిహిల్స్ లోని తన ప్యాలస్ లో పడుకోబెడ్తారు,సిఎం రేవంత్ రెడ్డి గారిది విధ్వంసకర మనస్తత్వం, వారికి నిర్మించడం కంటే కూలగొట్టడం మీదనే ఎక్కువ ప్రావీణ్యత ఉంటుంది,కేసీఆర్ ని తిట్టడం ద్వారా మాత్రమే నాయకుడు అయ్యాడు తప్ప ప్రజల నుండి పుట్టిన నాయకుడు కాదు అన్నారు.

తన రాజకీయ జీవితంలో ముఖ్య గట్టడం అంతా కేసీఆర్ ను తిట్టడం కేటీఆర్ ను అరెస్టు చెయ్యడం అంతే,కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని తమ జీవితంలో మాత్రం ఎక్కువ భాగం వారిపేరే రాసుకుంటున్నారు..కేటీఆర్ ని అరెస్టు చేయడమంటే నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టుకోవడమే,ఈ ఫార్ములా రేసు అంశం పై నిజా నిజాలన్ని ప్రజల ముందు ఉన్నాయ్. స్మార్ట్ ఫోన్ చేతిలో ప్రతీ యువకుడికి ఈ ఫార్ములా రేసుతో హైదారాబాద్ కి, తెలంగాణ కు జరిగిన మేలు తెల్సు అన్నారు రాకేష్ రెడ్డి.

Also Read:రాజ్యాంగాన్ని మార్చే కుట్ర: రామకృష్ణ

- Advertisement -