22న రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం..

190
rajyasabha oath
- Advertisement -

జులై 22న నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుందని తెలిపారు రాజ్యసభ సెక్రటరీ జనరల్.సభ్యునితో పాటు ఒక కుటుంబ సభ్యుడు లేదా ఒక గెస్ట్ కు మాత్రమే అనుమతిస్తామని….సామాజిక దూరం నిబంధనల ప్రకారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఇటీవల 20 రాష్ట్రాల నుంచి 61 మంది రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు.జులై 22న ప్రమాణస్వీకారం చేయలేనివారు రాబోయే వర్షాకాల సమావేశాల సందర్భంగా చేయవచ్చన్నారు.ఇప్పటికే నూతనంగా ఎన్నికైన సభ్యులకు ప్రమాణస్వీకారంకై లేఖలు రాశారు రాజ్యసభ సెక్రటరీ జనరల్.

- Advertisement -