బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్-రాజు యాదవ్ చూడు కు పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘థిస్ ఈజ్ మై దరిద్రం’ సాంగ్ ని హీరో సుడిగాలి సుదీర్ లాంచ్ చేశారు.
స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఎనర్జిటిక్ గా ట్యూన్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ హై వోకల్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం హీరో క్యారెక్టర్ ని హిలేరియస్ గా ప్రజెంట్ చేసింది. ఈ పాటలో హీరోకి ఎదురయ్యే సిట్యువేషన్స్ నవ్వులు పంచాయి. లవ్, కామెడీతో పాటు సినిమాలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా వున్నాయి. రాజుయాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
Also Read:KCR:అక్కరకు రాని చుట్టం బీజేపీ?