భయనికే భయంకలిగేలా ‘రాజుగారి గది 3’ ట్రైల‌ర్‌..!

429
Raju Gari Gadhi 3
- Advertisement -

అవికా గోర్, అశ్విన్ బాబు ప్రధాన పాత్రల్లో ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాజుగారి గది-3’. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుదల చేయ‌నున్నారు.ఈ నేపథ్యంలో చిత్ర ట్రైల‌ర్‌ని తాజాగా వెంక‌టేష్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. అశ్విన్‌, అవికాలు ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టారు.

ట్రైల‌ర్‌ లోనే దెయ్యంగా అవికా గోర్ భయపెడుతోంది. ట్రైల‌ర్‌ వినూత్నంగా ఉండి, ఇది హారర్ చిత్రమని చెప్పకనే చెబుతోంది. “ఈ కన్యను తాకాలని చూస్తే… నీకు తప్పదు మరణం” అని అశ్విన్ బాబు చెప్పిన డైలాగ్, దాని ముందు అశ్విన్ నటన, ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఈ ట్రైల‌ర్‌ను 4కే రెజల్యూషన్‌లో విడదల చేశారు.

షబీర్‌ సంగీతం అందిస్తోన్న ఈసినిమాలో ఊర్వశి,అలీ,బ్రహ్మాజీ,హరితేజ,ప్రభాస్‌ శ్రీను,అజయ్‌ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండ‌గా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

- Advertisement -