‘రాజు గారి గది 2’ ట్రైలర్…

244
Raju Gari Gadhi 2 Theatrical Trailer
- Advertisement -

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ మరియు ఓ.ఎ.కె ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రాజు గారి గది 2”. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్, నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా.. ఆడియన్స్ అండ్ నాగార్జున ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం పురస్కరించుకొని ఈ రోజున ట్రైలర్ ను విడుదల చేశారు.

Raju Gari Gadhi 2 Theatrical Trailer

ఈ మూవీలో నాగార్జున మెంటలిస్టుగా, కళ్లల్లో చూస్తూ గుండెల్లో ఏమున్నదో చెప్పే మానసిక వైద్యుడిగా కనిపిస్తున్నాడు. ఓ గోడలో నుంచి చెయ్యి వచ్చి మెడ పట్టుకునే దృశ్యాలు, సాధారణ హారర్ సినిమాల్లో కనిపించే శబ్దాలు కూడా ఉన్నాయి.

ఇక ఈ దెయ్యం మామూలుది కాదని, ఊరమాస్ దెయ్యమని, పిచ్చెక్కించేస్తోందని వెన్నెల కిశోర్ చెప్పటం, చేతిలో రుద్రాక్ష మాలతో నాగార్జున దాన్ని ఆటాడించే ప్రయత్నం చేయడం తెలుస్తోంది. ఓ అమ్మాయి ఆత్మ పగతో ఉందని, ప్రతీకారం కోరుతోందని నాగ్ చెప్పడం, ఆత్మ ఆకారాన్ని చిత్రిస్తే, దానంతట అదే మాయం కావడం వంటి దృశ్యాలతో ఈ ట్రయిలర్ అలరిస్తోంది. ఇక తొలి భాగంలో ఉన్న ఫేమస్ డైలాగ్ ‘బొమ్మాళీ నన్ను పెళ్లిచేసుకుంటావా?’ అన్న మాటలు ఇందులోనూ ఉన్నాయి. అక్టోబర్ 13న విడుదల కాబోతుంది ఈ మూవీ.

- Advertisement -