రాజు గారి గది 2… సెన్సార్ పూర్తి

220
Raju Gari Gadhi 2 gets U/A
- Advertisement -

కింగ్ నాగార్జున కథానాయకుడిగా ఓంకార్ దర్శకత్వంలో  తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ “రాజుగారి గది 2”.  క్షణం, ఘాజీ  లాంటి డీసెంట్ హిట్స్ అనంతరం పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది.ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ “రాజుగారి గది”కి సీక్వెల్ గా రూపొందిన “రాజుగారి గది 2″ సెన్సార్ పూర్తయ్యింది. హైక్వాలిటీ విఎఫెక్స్, ఆద్యంతం ఆకట్టుకొనే కథాంశం సినిమాకి కీలకమైన అంశాలు. ఓంకార్ సినిమాను సరికొత్తగా ట్రీట్ చేసిన విధానం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొంటుంది. నాగార్జున మెంటలిస్ట్ గా, సమంత ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో వెన్నెలకిషోర్, అశ్విన్, షకలక శంకర్ ల కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది. తప్పకుండా మొదటిభాగం కంటే పెద్ద హిట్ అవుతుందన్న పూర్తి నమ్మకం మాకుంది” అన్నారు.

ఈ సినిమాలో కాజల్ కూడా గెస్టు పాత్రలో నటించిందనే వార్త టాలీవుడ్‌లో షికార్లు చేస్తోంది. కాజల్ కూడా ఈ సినిమాలో కొంతసేపు దెయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం కోసమే ఈ విషయాన్ని దాచారని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.

- Advertisement -