టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మద్య జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ పటిష్ట స్థితిలో ఉంది. మొదట ఇంగ్లీష్ బౌలర్స్ ధాటికి 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా ఆ టైమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా బాగస్వామ్యం జట్టును గట్టెక్కించింది. గత కొన్నాళ్లుగా టెస్టు మ్యాచ్ లలో ఘోరంగా విఫలం అవుతున్న రోహిత్ ఈ మ్యాచ్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. జైస్వాల్, గిల్, పాటిదార్ వెనువెంటనే పెవిలియన్ చేరగా, వికెట్ల నష్టానికి అడ్డుకట్ట వేసి రాజ్ కోట్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో టెస్ట్ కెరియర్ లో 11 వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. 157 బంతులకు గాను 11 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో సెంచరీ సాధించాడు. ఇక రోహిత్ తో పాటు రవీంద్ర జడేజా కూడా సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా రెండో టెస్టు కు దూరమైన జడ్డూ.. ఈ మ్యాచ్ సెంచరీ సాధించి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపి నాటౌట్ గా ఉన్నాడు.
ఆరంభంలోనే అదుర్స్
టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మూడో టెస్టు తో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి టెస్ట్ లోనే అదరహో అనిపించాడు. ఇంగ్లీష్ బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దూకుడు కనబరిచాడు. అయితే 62 వ్యక్తిగత స్కోరు వద్ద రన్ ఔట్ కారణంగా వెనుదిరిగాడు. అయితే సర్ఫరాజ్ అద్బుత ప్రదర్శనతో ఆరంభ మ్యాచ్ లోనే వేగంగా అర్థ సెంచరీ సాధించిన టీమిండియా ప్లేయర్స్ లో మూడో స్థానంలో నిలిచాడు.
ప్రస్తుతం టీమిండియా 86 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులతో పటిష్టంగా ఉంది. రవీంద్ర జడేజా, కుల్దిప్ యాదవ్ ఉన్నారు.
Also Read:కుంకుమ పువ్వుతో ప్రయోజనాలు?