కాశీ విశ్వనాథుని సన్నిధిలో తలైవా..

248
rajanikanth
- Advertisement -

కెరీర్ స్టార్టింగ్ నుండి ప్రయోగాలు చేయటం అలవాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌కి. తన స్టైల్ తో కానీ తన లుక్స్ తో కానీ తన బాడీ లాంగ్వేజ్ లో కానీ డిఫరెంట్ గా చేస్తుంటారు. కబాలి,కాలా వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించిన రజనీ తాజాగా పెట్ట అనే సినిమాలో నటిస్తున్నారు.

పెట్ట సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరుగుతున్నది. లక్నోలో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి రాజకీయాలపై దృష్టి సారించే పనిలో ఉన్నారు తలైవా. ఈ సినిమాలో రెండు గెటప్‌లలో రజనీ దర్శనమివ్వనున్నారు.

rajani

అయితే తాజాగా రజినీకాంత్ నిన్న వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలో రజినీకాంత్ చాలా కొత్తగా కనిపించారు. నుదుటిపై పెద్ద నామాలు, మెలితిరిగిన మీసాలతో రజినీకాంత్ రూపం అద్భుతంగా ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రజనీ చేస్తున్న 165వ సినిమా ఇది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక. విజయ్ సేతుపతి, శశికాంత్, సిమ్రాన్, మేఘా ఆకాష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -