అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్యపాత్రల్లో సార్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 2.ఓ. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. అయితే టీజర్ రిలీజైన 24 గంట్లోనే 32 మిలియన్స్‌కిపైగా వ్యూస్ సంపాదించి రికార్డుల మోత మోగించింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో విజవల్ ఎఫెక్ట్స్ మాయాజాలం సినీ ప్రియులను ఆకట్టుకోగా.. చివరలో రజనీకాంత్ డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
లైకా సంస్థ దాదాపు రూ.545 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించగా.. సుమారు వెయ్యి మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పని చేశారు. నవంబర్ 29న అభిమానుల ముందుకురానున్న ఈ సినిమాకు 10 మంది కాన్సెప్ట్ ఆర్టిస్టులు, 25 మంది 3డీ డిజైనర్స్, 500 మంది క్రాఫ్ట్స్ మాన్‌గా పని చేశారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పెంచుకునే పనిలో మూవీ యూనిట్ బీజీ అయ్యింది.
ఏఆర్ రెహమాన్ సర్వపరిచిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందించింది. ఈ క్రమంలో తాజాగా రెండు లిరికల్ సాంగ్ వీడియోలను చిత్రబృందం విడుదల చేసింది. ఇక టీజర్‌కే ఇంతమంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ ఘన విజయం సాధిస్తుందని యూనిట్ భావిస్తోంది.