పాన్ ఇండియా హీరో రజనీకాంత్ త్వరలోనే మరో పాన్ ఇండియా డైరెక్టర్‌తో కలిసి పని చేయబోతున్నారాని కోలివుడ్ టాక్. అయితే ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు కలిసి గతంలో ఓ సినిమా కూడా చేశారు. వారేవరో కాదు మణిరత్నం రజినీకాంత్ జంట. ఇద్దరి మధ్య సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు.
1991లో విడుదలైన దళపతి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. అంతేకాకుండా కమర్షియల్గానూ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ప్రస్తుతం మరో ప్రాజెక్టును ఓకే చేశారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రజినీ జైలర్ సినిమాతో వస్తున్నాడు. కాగా మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్1 విజయంను ఎంజాయ్ చేస్తున్నాడు. పార్ట్2 కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నాడు. సెకండ్ పార్టు తర్వాత రజనీతో సినిమా పట్టాలెక్కుతుందని కోలీవుడ్ సమాచారం