ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ గొప్ప విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ విజయం దేశ రాజకీయ సమీకరణాలను మార్చబోతుందని తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అనుకున్న స్థాయిలో గెలిచిందన్నారు. ఇది బీజేపీ కార్యకర్తల విజయమని చెప్పారు. ఈ రెండు రాష్ర్టాల్లో బీజేపీని గెలిపించిన కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్‌లో భాజపా 3చోట్ల విజయం సాధించగా మరో 52 స్థానాల్లో గెలుపు అంచున నిలిచింది. అధికార కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించి మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఐదుచోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ బంపర్ విక్టరీ సాధించినా.. సీఎం హరీష్ రావత్ ఓడిపోవడం గమనార్హం. రెండు స్థానాల నుంచి పోటీ చేసినా.. ఒక్క చోటా ఆయనకు గెలుపు దక్కలేదు. మొదట హరిద్వార్ రూరల్ నుంచి రావత్ ఓటమి చవిచూశారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఈ స్థానం నుంచే ఆయన ఎంపీగా గెలవడం విశేషం. ఇక కిచ్చా స్థానం నుంచి కూడా ఓడిపోవడం రావత్‌కు మింగుడుపడటం లేదు. ఇక్కడ కేవలం 92 ఓట్ల తేడాతో రావత్ ఓడిపోయారు. జనవరి 26నే ఈ స్థానం నుంచి ఆయన నామినేషన్ వేశారు. కిచ్చాలో కచ్చితంగా గెలుస్తానని ఆయన విశ్వాసం వ్యక్తంచేసినా.. ప్రజలు మాత్రం మరో తీర్పు ఇచ్చారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన తొలి ఉత్తరాఖండ్ సీఎంగా హరీష్ రావత్ నిలిచారు.
బీజేపీ గొప్ప విజయం సాధించింది : రాజ్‌నాథ్
- Advertisement -
- Advertisement -