అందుబాటులోకి 2డీజీ డ్రగ్..

144
rajnath
- Advertisement -

కరోనా కట్టడిలో భాగంగా 2 డీజీ(2 డియాక్సీ డి గ్లూకోజ్‌) అందుబాటులోకి వచ్చింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ 2 డీజీ డ్రగ్‌ని విడుదల చేశారు. పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.

పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉండగా ఇది వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది.

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరి సహకారంతో అభివృద్ధి చేసింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది.

- Advertisement -