రాజ్‌కోట్ వన్డే.. టీమిండియా గెలిచేనా..!

419
kedar jadav
- Advertisement -

రాజ్‌ కోట్ వేదికగా నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే జరగనుంది. తొలి వన్డే ఓటమితో ఒత్తిడిలో ఉన్న భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి ఫామ్‌లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి వన్డే గెలుపుతో ఆసీస్ ఆత్మవిశ్వాసంలో ఉండగా మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక రాజ్‌కోట్‌లో ఇప్పటివరకు భారత్ గెలిచింది లేదు. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్‌ ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే కాదు రాజ్‌కోట్‌లో గెలుపు రుచిని చవిచూడాలని భావిస్తోంది,

విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రయోగం బెడిసికొట్టడంతో.. ఈసారి తనకు అచ్చొచ్చిన వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాంఖడేలో కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన మన బౌలర్లు.. రాజ్‌ కోట్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, రాహుల్‌, అయ్యర్‌, జాదవ్‌/దూబే, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, షమీ, బుమ్రా

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, కారీ, టర్నర్‌, ఆగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, జంపా

- Advertisement -