- Advertisement -
రాజీవ్ యువ వికాసం స్కీమ్ మంజూరు పత్రాల పంపిణీ వాయిదా పడింది. ఇవాళ తొలి రెండు కేటగిరీల వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా అనుకుంది.
అయితే ఈ స్కీమ్ కింద వచ్చిన అప్లికేషన్ల విషయంలో కంప్లైంట్లు వస్తుండటంతో అప్లికేషన్లపై అత్యంత పారదర్శకంగా పరిశీలన ఉండాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాయిదా వేశారు. అప్లికేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాతే అర్హుల లిస్టును విడుదల చేయనున్నారు.
ఈ నెల 5న కేబినెట్ భేటీలో చర్చించిన అనంతరం కొత్త తేదీని ప్రకటించనున్నారు. వాస్తవానికి రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు మంచి స్పందన వస్తోంది. 4 కేటగిరీల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అర్హులైనవారికి ఈ పథకం అందాలి తప్ప అనర్హులకు అందకూడదని అందుకే ఆలస్యం తప్పదని చెబుతున్నారు.
Also Read:వీడియో..డల్లాస్‌లో కేటీఆర్ స్పీచ్
- Advertisement -

