తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రా రాజీవ్ యువ వికాసం పథకం మూలపడింది. గత ఏడాది జూన్ 2వ తేదీన జరగాల్సిన పథకం అమలు కార్యక్రమం వాయిదా పడగా లక్షలాది నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు సేకరించి మూలకు పడేసింది ప్రభుత్వం.
నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తామని గత ఏడాది మార్చి 15 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తులు సేకరించింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 57,965 దరఖాస్తుల సేకరించగా గత ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు అర్హులైన అందరికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Also Read:రష్యా చమురు కొనుగోలు…భారత్‌కు మినహాయింపు
పథకం అమలు చేసే ఉద్దేశం లేనప్పుడు దరఖాస్తులు సేకరించడం దేనికి, తమను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దేనికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. ఈ పథకం ఇస్తారనే అనేక మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి, వేయించామని, ఇప్పటికైనా రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది నిరుద్యోగ యువత.

