Sardar 2: ‘సర్దార్ 2’లో రజిషా విజయన్

2
- Advertisement -

హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.

తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘సర్దార్’ లో ఆకట్టుకున్న రజిషా విజయన్ ఇప్పుడు ‘సర్దార్ 2’లో కూడా క్రూషియల్ రోల్ పోషిస్తున్నారు. మేకర్స్ ఆమెకు వెల్ కమ్ బ్యాక్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read:ఓటీటీలోకి మిస్టర్ బచ్చన్..?

- Advertisement -