గతంలో పేట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మరో మూవీతో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. తలైవా రజనీ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా రాబోతుంది. దీనికి ‘దర్బార్’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్ ఏర్పాటు చేశారు.
ముంబయి నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తే అర్థమవుతోంది. ఈ ఫస్ట్ లుక్ లో రజనీకాంత్‌ని పవర్ఫుల్ గా చూపించారు. రజనీ వెనుక తుపాకులు, బెల్ట్, బేడీలు కనిపిస్తున్నాయి. రెండు నెలలో చిత్రాన్ని పూర్తి చేయాలని మురుగదాస్ భావిస్తున్నాడట. నయనతార చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచంద్రన్ మరోసారి రజనీకాంత్ చిత్రానికి స్వరాలు అందించేందుకు సిద్ధమయ్యారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.