రజనీ ‘కాలా’ మాస్‌ లుక్ !

226
rajini kala mass look
- Advertisement -

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 161వ చిత్రం ‘కాలా’. రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. ట్వీట్టర్ ద్వారా పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు ధనుష్‌. ‘కబాలి’ విజయం తర్వాత మళ్లీ పా.రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్నారు.   ఈ చిత్రానికి ‘కాలా‌’ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. 2018లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా  ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు.

rajini 1  చుట్టూ మురికివాడ, భవనాలు, రైలు పట్టాలపై ఆడుకుంటున్న పిల్లలు, వీటి మధ్య జీపుపై స్టైల్‌గా మాస్‌లుక్‌తో కాలుమీద కాలేసుకుని కూర్చున్న రజనీ, ఆయన వెనుక నుంచి తొంగి చూస్తున్న ఓ కుక్క.. ఇలా ఈ పోస్టర్‌ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీగానటిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్‌ నారాయణ సంగీతం సమకూరుస్తున్నారు.  ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో దర్శక నటుడు సముద్రగని నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

rajini 2

- Advertisement -