నేడే రజినీ ‘దర్బార్’ ప్రారంభం..

493
rajini
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కించారు.

darbar

ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. రజనీ కటౌట్లతో థియేటర్‌ ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ షోస్‌కు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు ఉదయం 6 గంటలకే రజనీ అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకున్నారు. జనవరి 9, 10, 13, 14 తేదీల్లో స్పెషల్‌ షోలకు ప్రభుత్వం అనుమతించింది.

- Advertisement -