గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయిన 2.ఓ

248
2.o movie
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన 2.ఓ మూవీ తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈచిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ సినిమాలో విల‌న్ గా న‌టించారు. తాజాగా రోబో 2.ఓ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.

రోబో 2.ఓ గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయినట్లు ఈ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన రసూల్ పోకుట్టి తెలిపారు. ఫిబ్రవరి 17న అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న 66వ గోల్డెన్ రీల్ అవార్డుల ప్ర‌ధానోత్సవ వేడుకలో జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకూ అధిక శాతం ఓటింగ్ పొందిన చిత్రానికి ఈ అవార్డ్ అందించ‌నున్నారు. ఉత్తమ సౌండ్‌ ఎఫెక్ట్, ఎడిటింగ్‌ కళాకారులకు గోల్డెన్ రీల్ అవార్డులను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -